Telugu Gateway
Cinema

‘అ!’ విడుదల తేదీ వచ్చేసింది

‘అ!’ విడుదల తేదీ వచ్చేసింది
X

కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘అ!’. ఈ సినిమా నిర్మాత హీరో నాని అన్న విషయం తెలిసిందే. ఈ వినూత్న సినిమా విడుదల ముహుర్తం ఖరారైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ విషయాన్ని కూడా ఓ వెరైటీ పోస్టర్ ద్వారా తెలియజేశారు నాని. అందులో ఏమి చెప్పారో తెలుసా?. అదేంటో మీరూ చూడండి. ‘అన్ని సినిమాలయందు ‘అ’ సినిమా వేరయా. విశ్వదాభిరామ ఫిబ్రవరి 16న రిలీజ్ రా మామ’ అంటూ వేమన పద్యాన్ని వాడేశారు.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఈ సినిమాలో చేపకు నాని వాయిస్ ఓవర్ చెప్పగా..మరో హీరో రవితేజ ఓ మొక్క తరపున మాట్లాడారు. నాని నిర్మాతగా మారి..తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘అ!’ ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాలో కాజల్, నిత్యామీనన్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story
Share it