Telugu Gateway
Cinema

ఇద్దరిదీ ఒకటే ప్రాణం

మంచు విష్ణు, శ్రియలతో కూడిన గాయత్రి సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. కొద్ది రోజుల క్రితమే మోహన్ బాబుతో కూడిన ఫస్ట్ లుక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులోనే మంచు విష్ణు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కొత్తగా విడుదలైన ఫస్ట్ లుక్ లో శ్రియకు విష్ణు జడ వేస్తూ కనిపిస్తాడు.

'ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం' అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత చాలెజింగ్ రోల్ ఇదేనని, తన కెరీర్‌లో బెస్ట్ సాంగ్ కూడా ఇదేనని.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై విష్ణు కామెంట్ చేశారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. . తమన్ సంగీతం అందించాడు.

Next Story
Share it