గవర్నర్ టీఆర్ఎస్ లో చేరితే బెటర్
BY Telugu Gateway21 Jan 2018 6:19 PM IST

X
Telugu Gateway21 Jan 2018 6:19 PM IST
కాంగ్రెస్ పార్టీ మరోసారి గవర్నర్ నరసింహన్ పై మరోసారి మండిపడింది. ఆయన టీఆర్ఎస్ లో చేరితే బెటర్ అని సిఎల్పీ ఉప నతే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ ప్రాజెక్టు ఏజెంట్లా మాట్లాడారని విమర్శించారు. రాజకీయ భిక్ష కోసమే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలను తెలుసుకోకుండా గవర్నర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల ఆసక్తి, కేసీఆర్పై విశ్వాసం ఉంటే గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి నరసింహన్ చేసిన వ్యాఖ్యలు గవర్నర్ హోదాను కించపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Next Story



