Top
Telugu Gateway

నాని కారుకు ప్రమాదం

నాని కారుకు ప్రమాదం
X

టాలీవుడ్ లో వరస హిట్లుతో దూసుకెళుతున్న నాని పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను డీకొని...విద్యుత్ స్తంభాన్ని గుద్దేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే బెలూన్లు ఓపెన్ కావటంతో కారులో ఉన్న నాని చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయటంతో నాని ట్విట్టర్ ద్వారా అసలు విషయాన్ని తెలిపారు. ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని..అయితే తాను చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కారు హీరో నాని తండ్రి గంటా రాంబాబు పేరు మీద ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అయితే డ్రైవర్ మద్యం సేవించలేదని..నిద్రమత్తుతోనే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు తేల్చారు.

Next Story
Share it