రాజకీయ సర్దుబాట్లకు ‘టీటీడీ’ని వాడేస్తున్న చంద్రబాబు

ఓ వైపు తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్థులను అక్కడ నుంచి పంపేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది. హిందువులే అక్కడ పనిచేయాలనే ఖచ్చితమైన నిబంధన ఉందని..అన్యమతస్థులను వెనక్కి పంపిస్తామని ఈ మధ్యే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు కూడా. ఇది ఇలా ఉంటే ఏకంగా టీటీడీ ఛైర్మన్ గా క్రిస్టియన్ సభలకు హాజరైన పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించేందుకు చంద్రబాబు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా టీటీడీ పాలక మండలి..స్పెసిఫైడ్ ఆథారిటీ ఏమీలేకుండా పరిపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు.. తన రాజకీయ అవసరాల కోసం మళ్ళీ పుట్టా సుధాకర్ యాదవ్ ను తెరపైకి తెస్తున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆయనకు ఈ పోస్టు ఇవ్వటం ద్వారా టీడీపీలోకి చేరేందుకు సుముఖత చూపుతున్న ఓ కీలకనేతకు సీటు సర్దుబాటు చేయాలని చూస్తున్నారని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. సుధాకర్ యాదవ్ సువార్త సభలకు హాజరైన ఫ్లెక్సీలు అప్పట్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో చంద్రబాబునాయుడు కొంత కాలం ఈ ప్రతిపాదనను అటకెక్కించి అసలు టీటీడీ బోర్డును వేయకుండా జాప్యం చేశారు.
ఓ వైపు టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులపై వివాదం చెలరేగినప్పుడు..పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నియమించి చంద్రబాబు భక్తులకు ఏమి సందేశం పంపుతారని కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కేవలం తన రాజకీయ అవసరాల కోసమే టీటీడీ జేఈవో శ్రీనివాసరాజును సుప్రీంకోర్టు జడ్జి...పారిశ్రామికవేత్తలతో సిఫారసులతో సంవత్సరాల తరబడి అక్కడే కొనసాగిస్తున్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నియామకం కూడా అంతే జరిగింది. సంప్రదాయాలను పక్కన పెట్టి చంద్రబాబు ఈ నియామకం చేపట్టారు. ఢిల్లీ లాబీతోపాటు...సీఎంవోలోని ఓ ముఖ్య అధికారి ఈ నియామకంలో చక్రం తిప్పారని అధికార వర్గాలు తెలిపాయి. ఓ వైపు దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారం ఓ వైపు దుమారం రేపుతుండగానే..చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఇలా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను కూడా వాడుకోవాలని చూడటం సరికాదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. నిత్యం విలువలు..పద్దతులు..సంప్రదాయాల గురించి మాట్లాడే చంద్రబాబు వాటికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసి తాను చెప్పిందే వేదం అన్నట్లు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ కు 'టీఆర్ఎస్ రాజకీయ నివాళులు'
28 May 2022 4:54 AM GMTజగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT