Telugu Gateway
Politics

ఆ ‘ఓటమి’ భారం తప్పించుకునేందుకే మోడీ ప్లాన్ !

ఆ ‘ఓటమి’ భారం తప్పించుకునేందుకే మోడీ ప్లాన్ !
X

దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతోంది. ప్రతి సర్వే ఇదే విషయం చెబుతోంది. ప్రధానిగా మోడీకే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయంటున్నా మోడీపై ఉన్న ఆదరణ మాత్రం వేగంగా పడిపోతోంది. మోడీ..ఎన్డీయే జమిలి ఎన్నికల మంత్రం పఠించటటం వెనక బలమైన రాజకీయ కారణం ఉంది. ఓ అంశం ఆయన గ్రాఫ్ వేగంగా పడిపోతుండటం అయితే...మరో వైపు ఈ సంవత్సరాంతంలో బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల్లో బిజెపికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. విడిగా ఎన్నికలు జరిగి అక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ ప్రభావం షెడ్యూల్ ప్రకారం వెళితే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడటం ఖాయం.

బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల్లో బిజెపి ఓడిపోతే మోడీ పని అయిపోయిందని విపక్షాలు సహజంగానే ప్రచారం చేస్తాయి. వాటికి బలమైన అస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. ఇఫ్పటికే తగ్గిన ఆదరణ..ఈ ఫలితాలు చూసిన తర్వాత మరింత తగ్గటం ఖాయం. ఇది ప్రధాని మోడీకి, బిజెపికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల నాటికి వీలైనన్ని రాష్ట్రాలను ఒప్పించి తొలి దశ ప్రయోగం కింద జమిలికి వెళ్లటం ఖాయంగా కన్పిస్తోంది. సమయం ఉన్నా ఈ సంవత్సరాంతం నాటికి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయటం..అందుకు అన్ని పార్టీలను ఒఫ్పించటం సాధ్యంకాదనే విషయం తెలుసుకాబట్టే ఎన్డీయే పక్షాలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు.

కలసి వస్తే తెలంగాణ వంటి రాష్ట్రాలను కూడా కలుపుకుని డిసెంబర్ నెలకు కొంచెం అటు ఇటుగా ఎన్నికలకు వెళ్ళాలనేది మోడీ అండ్ కో ప్లాన్. షెడ్యూల్ ప్రకారం అయితే మంచి వేసవి వస్తుంది. ఈ లోగా డిసెంబర్ లో ఉంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అందుకు అంగీకరించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. పైకి మాత్రం ఒకేసారి ఎన్నికల వల్ల అభివృద్ధికి ఆటంకం ఉండదని చెబుతున్నా..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ అసలు ‘లక్ష్యం’ మాత్రం తన గ్రాఫ్ మరింత తగ్గే లోపే ఎన్నికలు పూర్తి చేసి..తాను సేఫ్ జోన్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it