బిజెపిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి వాళ్ళు తమతో పొత్తు వద్దనుకుంటే నమస్కారం పెట్టి బయటకు వస్తామని అన్నారు. గతంలోనూ పోలవరం విషయంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి వీటిని పునరుద్ఘాటించటంతో రాజకీయంలో ఏదో తేడా కొడుతుందనే విషయం తెలిసిపోతోంది. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. . ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ అన్నారు.
పార్టీ ఫిరాయించి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ఈ అంశాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం ఉంది. అయితే వీటిపై బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT