తెలుగోడు అటుపోకూడదు..తమిళోడు ఇటు రాకూడదు

ఎందుకంటే పగ. రాత్రి టీవీలో భాషా సినిమా చూశా. కానీ ఎందుకో తెలుగులో ఉన్నంత ఈజ్ గా రజనీ తమిళ్ లో చేయలేదు. ఇవీ నాగశౌర్య హీరోగా చేస్తున్న కొత్త సినిమా ‘ఛలో’ సినిమాలో డైలాగులు. ఈ సినిమాకు సంబంధించిన థ్రియేట్రికల్ ట్రైలర్ ను గురువారం నాడు విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగులో వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాగశౌర్య.
‘ఛలో’ సినిమాను నాగశౌర్య ఫ్యామిలీనే ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ రాష్ట్రాల మధ్య ఉన్న ఓ ఊరి గొడవ నేపథ్యంలో ఈ సినిమాను మంచి ఎంటర్ టైన్మెంట్ తో సినిమాను రూపొందించారు. నాగశౌర్య సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=6_BxEjvWsqs