Telugu Gateway
Andhra Pradesh

‘సూర్యుడే’ ఏపీ బ్రాండ్ అంబాసిడర్

‘సూర్యుడే’ ఏపీ బ్రాండ్ అంబాసిడర్
X

అవును. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నాడు చేసిన ప్రకటన. అంతే కాదు..సూర్యుడు జస్టిస్ చౌదరి లాంటోడని వ్యాఖ్యానించారు. అందరికీ న్యాయం చేస్తాడు కాబట్టే ఏపీకి ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన ‘సూర్యారాధన’ కార్యక్రమంలో సీఎం ఈ సంచలన ప్రటకటన చేశారు. .‘అన్ని మతాల్లో సూర్యుడికి విశిష్టమైన స్థానం ఉందన్నారు. పొడవైన తీరప్రాంతామున్న ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున దీనిని ‘సన్ రైజ్ స్టేట్’గా నినాదం ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగానే సూర్యుడిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించామని వెల్లడించారు. సూర్యారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర వేడుకగా ప్రతి ఏటా నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

సూర్యారాధన కార్యక్రమం..మతాలకు సంబంధంలేదని, పూర్తి శాస్త్ర విజ్ఞానమని పేర్కొన్నారు. సూర్యకాంతితో ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని, టెక్నాలజీ కంటే ప్రకృతితో మమేకం కావడం అవసరమన్నారు. అరబ్ దేశాల్లోనూ సూర్యుడిని ఆరాధిస్తారని,,క్రైస్తవులు బైబిల్ లోనూ సూర్యుడికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాదిస్తే అందరూ ఆయన్నుంచి నిత్య ప్రేరణ పొందవచ్చని తెలిపారు. 460 కోట్ల సంవత్సరాల వయస్సు ఉన్న సూర్యుడి నుంచి రోజూ శక్తి పొందుతున్నట్లు వెల్లడించారు.

chandrababu

Next Story
Share it