‘రిపోర్టర్’గా అనసూయ
బుల్లితెర స్టార్..అనసూయ రిపోర్టర్ అవతారం ఎత్తారు. అది ఎక్కడ అంటారా?. మోహన్ బాబు, మంచు విష్ణులు నటిస్తున్న ‘గాయత్రి’ సినిమాలో ఆమె ఈ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు చాలా పవర్ ఫుల్ పాత్రలో చేయనున్నట్లు కన్పిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకోగా తాజాగా చిత్ర బృందం అనసూయ పాత్రను పరిచయం చేసే పోస్టర్‌ను విడుదల చేసింది.
అనసూయ ఈ చిత్రంలో శ్రేష్ట జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. ఈ పోస్టర్‌ని అనసూయ తన ట్విటర్ పేజీలో ‘వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది.. ‘గాయత్రి’ మూవీ శ్రేష్ట జయరాం పరిచయం’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో విష్ణు మంచు, శ్రియలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ‘గాయత్రి’ చిత్రాన్ని డా.యం.మోహన్ బాబు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు.