భాగమతి సెన్సార్ పూర్తి
BY Telugu Gateway18 Jan 2018 4:01 PM IST
X
Telugu Gateway18 Jan 2018 4:01 PM IST
బాహుబలి 2 తర్వాత అనుష్క భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా గురువారం నాడే సెన్సార్ పూర్తి చేసుకుంది. జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌లతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
అనుష్క లీడ్ రోల్ లోనటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, జయరామ్, విద్యుల్లేఖ రామన్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిపబ్లిక్ డే కానుకగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష‍్క ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీనే ఈ భాగమతి.
Next Story