పరారీలో యాంకర్ ప్రదీప్
కొత్త సంవత్సరం తొలి రోజు ఫుల్ గా మందుకొట్టి పోలీసులకు చిక్కిన యాంకర్ ప్రదీప్ పరారీలో ఉన్నాడా? అంటే అవునంటున్నాయి పోలీసులు వర్గాలు. పోలీసులు చెప్పినట్లు కౌన్సిలింగ్ కు కూడా ప్రదీప్ హాజరు కాలేదు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనక్కి వచ్చేశారు. ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్లలో ఒకరు. టాప్ హీరోయిన్ల నుంచి హీరోల వరకూ ప్రతి ఒక్కరిని ఇంటర్వూలు చేసి టాప్ యాంకర్ గా నిలిచారు.
ప్రదీప్ లో ఉన్న ఈ జ్ కూడా ఆయనకు కలిసొచ్చింది. అయితే అనూహ్యంగా మందు కొట్టి పట్టుబడి చిక్కుల్లో పడ్డారు. ఈ నెల 2న బేగంపేట, గోషామహల్‌లో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లకు తల్లి లేదా భార్యతో కౌన్సెలింగ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. కూకట్‌పల్లిలోని కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.