Telugu Gateway

అమలాపాల్ కు లైంగిక వేధింపులు

అమలాపాల్ కు లైంగిక వేధింపులు
X

హీరోయిన్ అమలాపాల్ వరస పెట్టి కష్టాల్లో పడుతున్నారు. తాజాగా ఓ పన్ను ఎగవేత కేసులో అలా అరెస్టు ఇలా బెయిల్ పై బయటకు వచ్చిన ఈ హీరోయిన్ తాజాగా మరో చిక్కుల్లో పడ్డారు. ఆమె లైంగిక వేధింపులకు గురి కావటం..ఈ కేసులో నిందితుడు పారిశ్రామికవేత్త కావటం కలకలం రేపుతోంది. వ్యాపారవేత్త అలగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెన్నైలోని పాండిబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అలగేశన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నటి అమలాపాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు సమాజంలో భద్రత లేదని అన్నారు. మాటలతో చేతలతో మహిళలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనను వేధించిన అలగేశన్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో కోరారు. నటిగా ఉన్న తనకే ఇలాంటి వేధింపులు ఎదురైతే.. సామాన్య మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశముందని అన్నారు.ఏకంగా ఓ పారిశ్రామికవేత్త సినీ హీరోయిన్ ను లైంగికంగా వేధించటం చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it