Telugu Gateway
Andhra Pradesh

ప‌వ‌న్ రాజ‌కీయంపై అల్లు అర్జున్ సైలెంట్

ప‌వ‌న్ రాజ‌కీయంపై అల్లు అర్జున్ సైలెంట్
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంపై మెగా ఫ్యామిలీలో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య స‌ఖ్య‌త‌లేని విష‌యం తెలిసిందే. ఓ ఫంక్షన్ లో ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ చేస్తే అల్లు అర్జున్ సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. చిరంజీవితో ఎంతో స‌న్నిహితంగా ఉండే అల్లు అర్జున్ ప‌వ‌న్ తో పాటు అంటీముట్ట‌న‌ట్లే ఉంటారు. ఈ విష‌యం మ‌రోసారి నిరూపితం అయింది. ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర‌కు చిరంజీవి తనయుడు- రామ్‌చరణ్‌, మరో ఇద్దరు హీరోలు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు పవన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ త‌మ మద్ధతు ఉంటుందని ట్వీటర్‌లో ట్వీట్లు చేశారు.

అల్లు అర్జున్‌ మాత్రం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించలేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. ఇప్పటిదాకా పవన్‌కు విషెస్‌ చెప్పకపోవటం ఆసక్తిక‌రంగా మారింది. అల్లు శిరీష్‌ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఏది ఏమైనా సరైనోడు చిత్ర ఫంక్షన్ లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అంటూ ప‌వ‌న్ అభిమానుల‌కు అల్లు అర్జున్ ఝ‌ల‌క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it