నా పేరు సూర్య టీజర్ వచ్చేసింది
మళ్ళీ అల్లు అర్జున్ సందడి మొదలైంది. ఆయన కొత్త సినిమా ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా టీజర్ వచ్చేసింది. ప్రచారం జరిగినట్లుగానే ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటించారు. అదీ విపరీతమైన కోపం ఉన్న వ్యక్తిగా. అది టీజర్ లోనే స్పష్టంగా కన్పించింది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ టీజర్ ను విడుదల చేసింది. చచ్చిపోతా..కానీ ఇక్కడ కాదు..బోర్డర్ లో అంటూ అల్లు అర్జున్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు ఇందులో ఉన్నాయి. టీజర్ లో ఎక్కువ శాతం సైనికుడిగా కఠిన శిక్షణ..ఫైట్లు..పవర్ ఫుల్ డైలాగులు చూడొచ్చు. ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మాతలుగా ఉన్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అల్లు అర్జున్ కొత్త సంవత్సరం సందర్భంగా కొద్దిగా బ్రేక్ ఇఛ్చాడు. త్వరలోనే మళ్ళీ షూటింగ్ పట్టాలు ఎక్కనుంది. సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ ఈ సినిమాకు స్వరాలందిస్తున్నాడు.
https://www.youtube.com/watch?v=EnfoA2fF6GY