‘అల్లు అర్జున్’ దుమ్మురేపాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలై ఫస్ట్ ఇంపాక్ట్ నిజంగానే పెద్ద ఇంపాక్ట్ చూపించింది. అది ఎలా అంటే కేవలం 29గంటల్లోనే కోటి డిజిటల్ వ్యూస్ రికార్డుని అందుకోవటం. జనవరి 1 సాయంత్రం 5 గంటలకి డిజిటల్ మీడియాలో విడుదల చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ కోటి వ్యూస్‌తో నాన్ ‘బాహుబలి’ రికార్డులో తొలి స్థానంలో నిలిచినట్లు చిత్రబృందం ప్రకటించింది.
రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్ 27న సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు ‘‘మా సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికి నా ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అర్జున్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు.