Telugu Gateway
Cinema

అదే తేదీలో సూర్య వ‌స్తాడు

అదే తేదీలో సూర్య వ‌స్తాడు
X

ప్ర‌చారానికి బ్రేక్ వేశారు. సినిమా విడుద‌ల తేదీలో మార్పేమీ లేద‌ని ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌లు. ఈ వేస‌వి బ‌రిలో మ‌హేష్ బాబు సినిమా భ‌ర‌త్ అనే నేను..అల్లు అర్జున్ హీరోగా న‌టించిన నా పేరు సూర్య‌..నా ఇళ్లు ఇండియా సినిమా విడుద‌ల కానున్నాయి. దీంతో వేస‌వి బ‌రి హాట్ హాట్ గా మార‌నుంది. గ‌త కొన్ని రోజులుగా పోటీని నివారించేందుకు అల్లు అర్జున్ సినిమా విడుద‌ల‌ను ఒకింత ముందుకు మార్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే వీటిని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్‌ 27న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.

Next Story
Share it