Telugu Gateway
Telugu

ఆర్కే నగర్ ఉఫ ఎన్నికలో కొత్త ట్విస్ట్

తమిళనాడు రాజకీయాలు సినిమాల్లో ఉండే ట్విస్టుల కంటే ఎక్కువ ట్విస్ట్ లు ఇస్తున్నాయి. త్వరలో జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి జరిగిన తాజా పరిణామం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. అందుకు ప్రధాన కారణం హీరో విశాల్ రంగంలోకి దిగాడు. దీంతో ఒక్కసారి గా ఆర్కే నగర్ రాజకీయం వేడెక్కింది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నాడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు, డీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి. ఇఫ్పుడు బరిలోకి విశాల్ దిగటంతో తమిళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.

గత కొంత కాలంగా విశాల్ తమిళనాడు వ్యవహారాల్లో కీలకంగా మారారు. తమిళనాడును వరదలు ముంచెత్తిన సమయంతో పాటు పలు సందర్భాల్లో విశాల్ సినీ రంగం తరపున తన వంతు సాయం చేశారు. మాజీ సీఎం జయలలిత మరణంతో ఆర్కే నగర్ కు డిసెంబర్ 21న ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.23నే ఫలితాలు వస్తాయి. అన్ని ప్రధాన పార్టీలో బరిలో ఉంటున్నాయి. ఈ తరుణంలో విశాల్ రాక ఆర్కే నగర్ ఉప ఎన్నిక వేడిని మరింత రాజేసింది. అయితే సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది విశాల్ రాజకీయాల్లో ప్రవేశాన్ని స్వాగతిస్తుండగా..మరికొంత మంది తమిళవాదులు మాత్రం విశాల్ ను వ్యతిరేకిస్తున్నారు.

Next Story
Share it