Telugu Gateway
Telugu

ఆర్కేనగర్ బరిలోకి దిగిన విశాల్

విశాల్ చెప్పినట్లే చేశాడు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలోకి దూకాడు. స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం ఉదయం ఆయన తన నామినేషన్ దాఖలు చేశాడు. తొలుత జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లి నామినేషన్ సెట్ సంబంధిత అధికారులకు అందజేశాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదర్శమని ప్రకటించిన విశాల్‌.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్‌ ప్రజలను కోరాడు.

డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీ ఎంకే అమ్మ పార్టీ తరపున)‌, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇప్పుడు తమిళనాట క్రేజ్‌ సంపాదించుకున్న మాస్‌ హీరో విశాల్‌ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పుడు నిజంగానే దేశమంతటా ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Next Story
Share it