Telugu Gateway
Cinema

అనుష్కనిచ్చారు..థ్యాంక్స్

విజయ్ దేవరకొండ యాక్షన్ ఒక్కటే కాదు..మాటలూ బోల్డ్ గానే ఉంటాయి. పెళ్లిచూపులు వంటి తొలి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో...‘అర్జున్ రెడ్డి’తో మరింత కనెక్ట్ అయ్యాడు యూత్ కు. పలు ఇంటర్వూల్లోనూ ఏ మాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఇప్పుడు తాజాగా విజయ్ చేసిన వ్యాఖ్యలూ అలాగే ఉన్నాయి. ఓ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న విజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు అనుష్క శెట్టి వంటి అందమైన హీరోయిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి నటులను అందించిన కర్ణాటకకు ‘థ్యాంక్స్’ అని చెప్పారు.

కన్నడకు చెందిన ప్రముఖ నటుడు గణేష్ నటించిన చమక్ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొన్న సమయంలో విజయ్ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ కు గొప్ప క్రికెటర్లను అందించిన కర్ణాటక..మంచి నటులను కూడా అందించిందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా రష్మిక మందన కూడా టాలీవుడ్ లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. విజయ్ హీరోగా నటించే సినిమా ఏ మంత్రం వేశావేలోనే రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. కన్నడ చిత్రాల్లోని స్టైల్ తనను ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు.

Next Story
Share it