ఇద్దరు అమ్మాయిల పెళ్లి
పెళ్లి అంటే మనకు తెలిసి..ఓ అమ్మాయి..ఓ అబ్బాయి ఉండాలి. అదే మనకు తెలిసిన పెళ్లి. ఇద్దరు అమ్మాయిలు..ఇద్దరు అబ్బాయిలు కలసి ఉండే సంఘటనలు విదేశాల్లో సహజమే అయినా..భారత్ లో మాత్రం విచిత్రంగానే పరిగణిస్తారు. ఎందుకంటే అది అసహజమైన పరిణామం కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కానీ నిజం. అక్కడ జరిగిన సంఘటన ఏంటో మీరే చూడండి. ఓ యువతి మరో యువతిని వివాహమాడిన సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో జరిగింది. మౌనిక, రమాదేవి అనే ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రమాదేవి మగ అవతారమెత్తి మౌనిక అనే యువతిని వివాహం చేసుకుంది. విషయం తెలిసిన మౌనిక బంధువులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు ఆమెను ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ రమాదేవికి మరో ఇద్దరు యువతులతో వివాహమైనట్లు ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో ఇలాంటి ఘటన జరగటంతో అందరూ అవాక్కు అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా ధోరణి ఎలా ప్రబలుతుందనే అనుమానాలు పోలీసులను కూడా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా యువత ఇలాంటి పెడధోరణులకు అలవాటు పడటానికి ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ ఫోన్లలో వీడియోలు అందుబాటులో ఉండటమే కారణం అని భావిస్తున్నారు. యూట్యూబ్ లో ఇలా ఇద్దరు అమ్మాయిలు చేసే అసహజ కామక్రీడలు కూడా ఓ కారణంగా చెబుతున్నారు.