వెంకటేష్..త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా
BY Telugu Gateway13 Dec 2017 11:38 AM IST
Telugu Gateway13 Dec 2017 11:38 AM IST
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీడ్ పెంచారు. వరస పెట్టి సినిమాలతో దూసుకెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాత వాసి సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పటికే ఎన్టీఆర్ తో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అది ఉండగానే ఇప్పుడు వెంకటేష్ తో మరో సినిమాకు రెడీ అయిపోయారు. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు ఈ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైనే వెంకటేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయనున్నారు.
వెంకటేష్ గతంలో నటించి..సూపర్ హిట్ అయిన సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే . మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ కావటంతో వెంటకేష్ అభిమానులు ఈ సినిమావైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తో ఓకే చేసిన పూర్తయిన తర్వాతే ఇది పట్టాలు ఎక్కే అవకాశం ఉందని సమాచారం.
Next Story



