టాలీవుడ్ కు షాక్..హస్యనటుడు విజయ్ ఆత్మహత్య
అందరూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి ...కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న తరుణంలో టాలీవుడ్ కు షాక్. తెలుగులో పలు సినిమాల్లో నటించిన హస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. విజయ్ బొమ్మరిల్లు, అమ్మాయిలు-అబ్బాయిలు తోపాటు పలు సినిమాల్లో హీరో స్నేహితుడిగా..కమెడియన్ గా నటించారు. సోమవారం యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో విజయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సినిమాల్లో సరైన అవకాశాలు లేకపోవటం వల్ల కూడా విజయ్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. విజయ్ ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయ్ అతడి భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక పాప ఉంది. విడాకుల అనంతరం పాప భార్య సంరక్షణలోనే ఉంది. అయితే పాపను చూసేందుకు కూడా భార్య అనుమతించకపోవడంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ కారణంతోనే విజయ్ ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న వయస్సులోనే విజయ్ ఇలా అర్థాంతరంగా జీవితాన్ని చాలించటంపై పరిశ్రమలోని వ్యక్తులు ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.