ఏపీ సచివాలయంలో పాము కలకలం
BY Telugu Gateway5 Dec 2017 1:06 PM IST
Telugu Gateway5 Dec 2017 1:06 PM IST
ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి సచివాలయంలో మంగళవారం నాడు పాము కలకలం రేపింది. పామును చూసి ఉద్యోగులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా పామును చంపేశారు. దీంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. వెలగపూడి సచివాలయంలో చుట్టుపక్కల అంతా వ్యవసాయ భూములు..ఖాళీ ప్రాంతమే ఉండటంతో పాములు అక్కడ తిరగటం మామూలే అని చెబుతున్నారు.
వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాకులోని హోం శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు ఇది కన్పించింది. అంతే అందరూ ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఉదయమే క్లీనింగ్ సిబ్బంది తమ పనిలో ఉండగా..పాము బయటకు వచ్చింది. పాము హంగామాతో కొన్ని గంటల పాటు ఉద్యోగులు తమ సీట్లలో కూర్చోవటానికే భయపడి..బయట తిరగాల్సి వచ్చింది.
Next Story