Telugu Gateway
Telangana

షార్ట్ పిలిం క‌హానీ..పెద్ద సినిమాను త‌ల‌పించేలా

అది ఓ షార్ట్ ఫిలిం డైర‌క్ట‌ర్...ఓ న‌టి వివాదం. కాక‌పోతే ఓ పెద్ద సినిమా క‌థ‌ను మించిపోయేలా ఉంది. ఒక‌రిపై ఒక‌రు చెప్పుకుంటున్న క‌థ‌లు చూస్తే ఎవ‌రికైనా ఇదే అభిప్రాయం క‌ల‌గ‌టం స‌హ‌జం. అలా ఉంది ఈ వ్య‌వ‌హారం. బాధితురాలు హారిక శ‌నివారం నాడు మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న విష‌యాలు బ‌హిర్గ‌తం చేశారు. ’’ డైర‌క్ట‌ర్ యోగితో వివాదంపై హీరోయిన్ హారిక స‍్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని యోగి చెప్పడం స‌రికాద‌న్నారు. తనను యోగి వేధించిందనందుకే పోలీసులను ఆశ్రయించానని వెల్ల‌డించారు. తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకర పదాలతో మెసేజ్ లు చేశాడని, సాక్ష్యాలను పోలీసులకు అందించానని తెలిపారు. పది రోజుల క్రితం వరకు బాగానే ఉన్న యోగి కొద్ది రోజులుగానే ఇలా ప్రవర్తిస్తున్నాడని హారిక తెలిపారు.

యోగి గతంలో కూడా కొంత మంది అమ్మాయిలను ఇలాగే వేధించాడని.. గతంలో జేడీ చక్రవర్తి భార్య అనుకృతి కూడా ‘పాప’ అనే షార్ట్ ఫిలిం సమయంలో యోగిపై పోలీస్ కంప‍్లయింట్ ఇచ్చినట్లు హారిక తెలిపారు. అతడు బయటకు కనిపించేంత మంచి వాడు కాదని, అందరి ముందు ఎంతో మర్యాదగా నటించే యోగి గతంలో చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. యోగి గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తుతం అతనితో రిలేషన్ లో ఉన్న అమ్మాయికి చెప్పానని, దీంతో తన మీద పగ పెంచుకున్నట్లు హారిక వెల్ల‌డించారు. తనపై వేధింపులకు దిగటంతో గతంలో ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నానని.. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసుల ఎదుట కూడా యోగి అసభ్యకర భాష వాడటం వల్లే...అడిషనల్‌ డీసీపీ యోగిని కొట్టినట్లు చెప్పారు.

Next Story
Share it