Telugu Gateway
Telugu

రెండు వేల నోట్ల సరఫరా ఆపేశారా!

ఇప్పుడు అందరి మదిలో ఇదే అనుమానం. అదీ దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బిఐ నివేదిక బహిర్గతం చేయటంతో పెద్ద సంచలనంగా మారింది. లెక్కలతో సహా ఈ నివేదిక వెల్లడించిన అంశాలు షాకింగ్ గా ఉన్నాయి. ఈ లెక్కన త్వరలోనే రెండు వేల రూపాయల నోటు కూడా కనుమరుగు అయ్యే అవకాశం ఉందా? అనే అనుమానాలు రావటం ఖాయంగా కన్పిస్తోంది. అదేంటో మీరూ చూడండి. డిసెంబర్ 8 నాటికి దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ 13,324 బిలియన్లు ఉన్నాయి. వాస్తవానికి ప్రింట్ చేసిన మొత్తం 15,787 బిలియన్లు అని ఎస్ బిఐ నివేదిక బహిర్గతం చేసింది. ఈ లెక్కన మార్కెట్లోకి రాకుండా 2,463 బిలియన్ల పెద్ద నోట్లను మార్కెట్లోకి రాకుండా ఆపేసినట్లు అవగతం అవుతోంది.

ఈ లెక్కన మళ్లీ రెండు వేల రూపాయల నోటు కూడా కనుమరుగు అవుతుందా? అన్న అనుమానం బ్యాంకింగ్ వర్గాల్లో కూడా వస్తుంది. ప్రస్తుతం ఆర్ బిఐ చిన్న నోట్లను మార్కెట్లోకి విడుదల చేయటంపైనే దృష్టి సారించినట్లు చెబుతున్నారు. గతంలోనూ రెండు వేల రూపాయల నోటుపై ఎన్నో వార్తలు వచ్చినా..ఇప్పుడు ఎస్ బిఐ నివేదిక పలు అంశాలను బహిర్గతం కీలకంగా మారింది. లోక్ సభలో ఆర్ బిఐ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎస్ బిఐ ఈ నివేదికను వెల్లడించింది. మరి భవిష్యత్ లో ఏమి రెండు వేల రూపాయల నోటు ఏమి చేస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it