స్టార్ హోటల్ లో ‘ఇద్దరు స్టార్స్ వ్యభిచారం’
అవి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్స్. అందులో ఇద్దరు ‘స్టార్స్’ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. తాజ్ డెక్కన్ హోటల్ లోని ఓ హోటల్ గదిపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. హోటల్ మేనేజర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ముంబయ్ కి చెందిన బాలీవుడ్ నటి రిచా సక్సెనా పోలీసులకు చిక్కింది. ఆమెతో పాటు ముంబాయి కి చెందిన వ్యభిచార నిర్వాహకుడు మోనిష్ కడాకియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ముంబయ్ నుంచి శుక్రవారం నాడే నగరానికి చేరుకుని హోటల్ లో రూములు తీసుకున్నారు. కడాకియా ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వీరిద్దరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అంతే కాదు...తాజ్ బంజారాలోనూ ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తాజా బంజారా హోటల్ లో ని ఓ గదిలో బెంగాలీ టీవీ నటి సుబ్ర ఛటర్జీ, విటుడు వెంకటేశ్వరరావులు పోలీసులకు పట్టుపడ్డారు. ఈ వ్యభిచార నిర్వాహకుడు జనార్థన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.