Telugu Gateway
Telugu

ఆగని ‘జియో దూకుడు’

టెలికం మార్కెట్లో జియో దూకుడు ఏ మాత్రం తగ్గటం లేదు. నిత్యం కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే ఇప్పుడు జియో కస్టమర్ల సంఖ్య ఏకంగా 16 కోట్లకు చేరింది. వాయిస్‌, డేటా ఆఫర్స్‌ తో రిలయన్స్‌ జియో మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. రిలయన్స్‌ జియో తాజా సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను ముఖేష్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ అంబానీ ప్రకటించారు. జియో వచ్చినప్పటి నుంచి టెలికాం మార్కెట్‌లో ధరల యుద్ధం ప్రారంభమైంది.

మరోవైపు దేశీయ టెలికాం ఆపరేటర్లు భద్రతాపరమైన విషయాల్లో, 5జీ వాతావరణంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్‌ జియో చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ బ్రిజేష్‌ దత్తా వ్యాఖ్యానించారు. ఆధునిక టెక్నాలజీలు సాఫ్ట్‌ వేర్‌ డిఫైన్డ్ నెట్‌వర్కింగ్‌, నెట్‌వర్క్స్‌ ఫంక్షన్స్‌ వర్చ్యూలైజేషన్‌ వంటి వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీస్‌ రిటైల్‌, సంస్థ కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు అందజేస్తాయన్నారు. జియో వచ్చిన తర్వాతే దేశంలోని అగ్రశ్రేణి టెలికం కంపెనీలు అన్నీ డేటా ఛార్జీలను తగ్గించటం మొదలుపెట్టాయి.

Next Story
Share it