Telugu Gateway
Telugu

కోడలిపై మామ దారుణం

అప్పటికే ఆయన కు ముగ్గురు భార్యలు. అయినా అతగాడి మనసు పక్కచూపులు చూడటం ఆగలేదు. అది కూడా సొంత కోడలిపైనే కన్నేశాడు. అంతే దారుణానికి ఒడిగట్టాడు. అది కూడా మూడో భార్య సహకారంతో ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. వరస పెట్టి చేసిన అత్యాచారం వల్ల కోడలు. మామ వల్ల గర్భవతి అవటమే కాదు..ఓ పిల్లాడికి కూడా జన్మనిచ్చింది. ఈ విషయం డీఎన్ఏ టెస్టులో తేలింది. ఈ వ్యవహారం సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో కలకలం రేపింది. మోహన్ దాస్ అనే అరవై సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కోడలిని ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించిన మామ తన మూడవ భార్య భారతీ సహకారంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అవకాశం ఉన్నప్పుడు అల్లా కోడలికి అత్తే జ్యూస్ లో మత్తు మందు కలిపి ఇఛ్చిది.

ఆ సమయంలోనే అతడు అత్యాచారం చేశాడు. తర్వాతో ఎలాగోలా విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించగా..ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. పుట్టిన బాబు మోహన్ దాస్ కారణంగానే జన్మనిచ్చాడనే విషయం తేలింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దీనికి సహకరించిన మోహన్ దాస్ ను , భారతిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it