రేప్ కు గురైన సినీ నటి
ఓ సిని నటి రేప్ కు గురైంది. పలు టీవీలతో పాటు సినిమాల్లో పాత్రలు పోషించిన 23 సంవత్సరాల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. బాధిత యువతి వయస్సు 23 సంవత్సరాలుగా పోలీసులు తెలిపారు. బీహార్‌కు చెందిన ఈ యువతి మోడలింగ్ కోసం ఢిల్లీకి వచ్చింది. అక్కడ నుంచే అవకాశాలు వెతుక్కుంటూ...పలు సీరియళ్లలో పాత్రలు చేసింది. ఓ ముగ్గురు వ్యక్తులు ఆమెను కలిసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని నమ్మించారు. తర్వాత ముంబైలో ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ కొత్త వాళ్ల కోసం అన్వేషణ ప్రారంభించాడని.. నేరుగా ఆయనతోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. డిసెంబర్ 25న సరోజినీ నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌కు తీసుకెళ్లి.. ఆ ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మరుసటి రోజు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ దురాగతానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు చేసిన కొద్దిసేపటికే నిందితులను విడుదల చేసినట్లు తెలియటంతో సదరు మోడల్ ఆందోళనకు సిద్ధమైంది. వారి వల్ల తన ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఆమె భయపడుతోంది. అయితే వారిని బెయిల్ పై విడుదల చేశామని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఓ రేప్ కేసులో ఉన్న వారిని పోలీసులు ఇంత తొందరగా ఎలా విడుదల చేశారన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.