Telugu Gateway
Telugu

సింధుకు మళ్లీ నిరాశే

పీ వీ సింధును ‘ఫైనల్ ఫోబియా’ వదులుతున్నట్లు లేదు. అన్ని గేమ్స్ ఫర్పెక్ట్ గా ఆడుతూనే ఫైనల్ వరకూ చేరుకోవటం...ఫైనల్లో తడపడటం గత కొంత కాలంగా కామన్ గా మారిపోయింది. తాజాగా మళ్లీ అదే రిపీట్ అయింది. దుబాయ్ లో జరిగిన వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రన్నరప్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ప్రత్యర్థి ఎత్తుల ముందు తలవంచాల్సి వచ్చింది సింధుకు. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-12, 21-19 తేడాతో యామగుచి(జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను అలవొకగా గెలిచిన సింధు.. ఆపై వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి టైటిల్‌ దక్కించుకోవటంలో తడబాటుకు గురైంది. ఈ గేమ్ లో తొలి నుంచి యామగుచి వరుస నాలుగు పాయింట్లు సాధించిన సమయంలో సింధు తిరిగి పుంజుకుంది. సింధు 3-5తో వెనుకబడిన దశలో వరుసగా పాయింట్ల సాధించి స్కోరును 5-5తో సమం చేసింది. ఆపై అదే జోరును కొనసాగించి 11-8, 13-9 పాయింట్ల తేడాతో ముందుకు సాగింది. సింధు 15-13తో ఆధిక్యంలో ఉన్న దశలోవరుసగా నాలుగు పాయింట్లను సాధించి 19-13తో యామగుచిని మరింత వెనక్కినెట్టింది..ఆ తర్వాత యామగుచికి రెండు పాయింట్లను మాత్రమే కోల్పోయిన సింధు 21-15తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక రెండో గేమ్‌లో సింధు 5-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో యామగుచి తన వ్యూహానికి పదునుపెట్టింది. ప్రధానంగా రెండో గేమ్‌ సగం వరకూ సింధు ఆధిక్యం కొనసాగినప్పటికీ ఆపై యామగుచి దుమ్మురేపింది. సుదీర్ఘమైన ర్యాలీలతో సింధుకు పరీక్ష పెట్టడంతో పాటు అద్బుతమైన స్మాష్‌లతో చెలరేగి ఆడింది. ఈ క్రమంలోనే యామగుచి 11-9, 13-11 తో ఆధిక్యాన్నిసాధించింది. అదే ఊపును కడవరకూ సాగించిన యామగుచి 21-12తో ఆ గేమ్‌ను దక్కించుకుంది. అత్యంత కీలకమైన మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. సింధు వరుసగా నాలుగు పాయింట్లు 4-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో యామగుచి మూడు పాయింట్లు సాధించింది. ఫలితంగా సింధు ఆధిక్యం 4-3కు తగ్గింది. అటు తరువాత 5-5, 6-6తో ఇద్దరూ సమంగా నిలిచిన దశలో సింధు స్మాష్‌లతో ఆకట్టుకుంది. ఫలితంగా సింధు 11-8తో పైచేయి సాధించింది. కాగా, అప్పుడే అసలు సిసలైన సమరం మొదలైంది. ప్రతి పాయింట్‌ కోసం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కాగా, చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఆఖరి గేమ్‌లో యామగుచి 21-19తేడాతో గేమ్‌ను దక్కించుకోవడంతో పాటు టైటిల్‌ను దక్కించుకుంది.

Next Story
Share it