పూరీ జగన్నాధ్ ‘హగ్’
టాలీవుడ్ లో ఆయన ఇప్పుడు విజయాలు అందుకోవటంలో ఆయన కాస్త స్లో అయ్యారు. కానీ ఒకప్పుడు సంచలన విజయాలు నమోదు చేశారు. అలాంటి పూరీ జగన్నాధ్ ఇప్పుడు రూట్ మార్చారు. ఓ వైపు వెండితెరపై కొనసాగుతూనే ..ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తున్న రంగంలోనూ తన సత్తా ఏంటో చాటడానికి రెడీ అయ్యారు. అంతే కాదు..తొలి ప్రాజెక్టు కూడా ఈ నెలాఖరులోనే రానుంది. డిసెంబర్ 31 ఉదయం 10 గంటలకు తన మొట్టమొదటి షార్ట్ ఫిలిం ‘హగ్'ని యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు పూరీ జగన్నాధ్ వెల్లడించారు.
వెబ్‌సిరీస్‌లకు పెరుగుతున్న ప్రాముఖ్యత నేపథ్యంలో పూరీ కూడా వీటిపై కన్నేశారు. ఈ విషయాన్ని స్వయంగా పూరీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన బ్యానర్ 'పూరి కనెక్ట్' పై విభిన్నమైన సబ్జక్ట్స్ తో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్ లో పెట్టాలన్నది పూరీ టీమ్ ఆలోచనగా ఉంది. చూడాలి మరి వెండితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేసిన పూరీ యూట్యూబ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో వేచిచూడాల్సిందే.