ప్రభాస్ అభిమాన నటి ఎవరో తెలుసా?
ఎంత పెద్ద హీరో అయినా...హీరోయిన్ అయినా వాళ్లకు అభిమాన నటీ, నటులు ఉంటారు కదా?. దీనికి బాహుబలి హీరో ప్రభాస్ కూడా మినహాయింపు ఏమీ కాదు. అయితే ప్రభాస్ అభిమాన నటి ఎవరో తెలుసా?. అనుష్క అనుకుంటే మీరు పొరపడినట్లే. ఆయన తన అభిమాన నటి ఎవరో ఇటీవల బహిర్గతం చేశారు. ఆమె ఎవరో కాదు ..బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్. రవీనాకు తాను వీరాభిమానినని.. అందాజ్ అప్నా అప్నా చిత్రంలోని ‘ఎలో జీ సనమ్’ పాట ప్రతీ క్షణం తనని వెంటాడుతుందని ప్రభాస్ చెప్పాడు. ఆమెతో నటించే అవకాశం వస్తే అస్సలు వదలిపెట్టనన్నాడు.
అయితే అనుకోకుండా బాహుబలి సిరీస్‌ను ఆమె భర్త అనిల్ టాండానీ బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. దీంతో బాహుబలి ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన ప్రతీసారి ప్రభాస్ రవీనా టండన్ దంపతులను కలిసేవాడు. ఆ తర్వాత కూడా వీలుచిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్తున్న ప్రభాస్ అదే పని చేస్తూ వస్తున్నాడు. అంతెందుకు ఈ మధ్య కూడా ఓసారి డిన్నర్ కోసం ప్రభాస్ వాళ్లింటికి వెళ్లి.. రవీనాతో సెల్ఫీలు దిగి సంబరపడిపోయాడు. వీరిద్దరూ దిగిన ఫోటోలను రవీనా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.