Telugu Gateway
Telugu

ప్రేమించలేదని..అమ్మాయిపై పెట్రోల్ పోశాడు

హైదరాబాద్ లో గురువారం ఊహించని ఘటన. ప్రేమించలేదని ఓ ఉన్మాది తాను ప్రేమిస్తున్న అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆ అమ్మాయి 70 శాతం పైగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటన నార్త్ జోన్ పరిధిలో జరిగింది. సంధ్యారాణి(22) అనే యువతిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటికి ఓ యువకుడు తానే పెట్రోలు పోసి నిప్పుపెట్టినట్లు చెప్పాడు. యువతిని ప్రేమించిన వ్యక్తే దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. కార్తీక్‌ అనే యువకుడిపై యువతి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఫోన్ చేసిన టవర్ లొకేషన్ లాలాగూడా పోలీసులు చేధించారు. సంధ్యారాణి శాంతినగర్ లోని లక్కీ ట్రేడర్స్‌ లో ఉద్యోగిగా పనిచేస్తోంది.

Next Story
Share it