సర్కారుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారా?
ట్విట్టర్ లో ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. తాను వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి సమస్య గురించి మాట్లాడితే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వ్యాఖ్యానించారు. కాబట్టి బాధిత మహిళకు సత్వరమే న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని, నిస్సహాయురాలిపై కొంతమంది వ్యక్తులు చేసిన దాడి కులం రంగు పులుముకుంటుందన్నారు. కొంత మంది వ్యక్తులు చేసే ఇలాంటి నేరాలు తీవ్రమైన కులం గొడవలుగా మారతుంటాయని తెలిపారు. తాజాగా విశాఖపట్నంలో ఓ మహిళ భూమి గుంజుకునేందుకు జరిగిన దాడి గురించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పలు పోస్టులు పెట్టారు. ప్రభుత్వం, అధికారులు మాత్రమే కాకుండా దాడికి పాల్పడిన కులానికి సంబంధించిన పెద్దలు కూడా ఈ ఘటనను ఖండించి బాధితురాలికి అండగా నిలవాలని కోరారు. అలా చేస్తేనే సమాజంలో శాంతి భద్రతలకు అవాంతరం కలగకుండా ఉంటుంది. ఇక, ఈ వివాదాన్ని సంచలనం చేయకుండా సంయమనం పాటించాలని మీడియాను కోరుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని ఓ భూ వివాదం కేసులో ఓ దళిత మహిళపై రాజకీయ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపైనే ఆమె బట్టలు ఊడదీసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. బాధిత మహిళకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని కోరారు. లేకపోతే సమస్య తీవ్రమవుతుందని హెచ్చరించారు.‘‘విశాఖలో రాజకీయ నాయకుల దాష్టికానికి గురైన మహిళ కేసులో ప్రభుత్వం నుంచి సరైన స్పందనను ప్రజలు ఆశిస్తున్నారు. ఈ నేరానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం లేదా పోలీసుల తరఫు నుంచి చర్యలు లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుంది. ఈ వివాదం విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాలి. రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయి. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోతే ఇది రోహిత్ వేముల ఘటన మాదిరిగా జాతీయ సమస్యగా పరిణమిస్తుందని వ్యాఖ్యానించారు.