Telugu Gateway
Cinema

ఎంసీఏ మూవీ రివ్యూ

నాని. ఈ మధ్య కాలంలో ఫెయిల్యూర్ లేని హీరో. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా..వరసగా అన్నీ హిట్లే. ఆ జాబితాలో ఉన్నవే జెంటిల్ మెన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి వంటి సినిమాలు. ఇంకా వెనక్కి వెళితే భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ కూడా హిట్లే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నాని..ఫిదా సినిమాతో తన సత్తా చాటిన భామ సాయిపల్లవి జంటగా నటించిన ఎంసీఏ..మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ సినిమాలో భూమిక కూడా కీలక పాత్ర పోషించారు. మరి జోష్ లో ఉన్న హీరో నాని తన జోరు కొనసాగించారా? లేదా తెలుసుకోవాలని ఉందా?. అయితే పదండి ముందుకు..ఇక అసలు కథ విషయంలోకి వస్తే నాని..రాజీవ్ కనకాల అన్నదమ్ములు. అయినా ఫ్రెండ్స్ లా ఉంటారు. రాజీవ్ కనకాల, నానిలు ప్రతి వారం సరదాగా మందుకొడుతూ...జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ దశలో రాజీవ్ కనకాలకు భూమికతో పెళ్లి అవుతుంది. అంతే అప్పటివరకూ రాజీవ్, నానిలు ఉన్న ఫోటో ప్రేమ్ లోకి భూమిక ఎంటర్ అవుతుంది. ఫోటో ప్రేమ్ లో ఇద్దరే కదా పట్టేది..మరి నాని అందులో నుంచి బయటపడిపోతాడు. అంతే నానికి వదినపై కోపం పెరుగుతుంది. అప్పటిదాకా సరదాగా..సాఫీగా సాగిన తమ జీవితం వదిన వచ్చాకే దెబ్బతిన్నదని ఆగ్రహంతో ఉంటాడు.

ఈ దశలో ఆర్ టీఏ అధికారిగా పనిచేసే భూమికకు వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. వదినకు తోడు నానిని కూడా వరంగల్ పంపిస్తాడు రాజీవ్. ఎంతో స్ట్రిక్ట్ అధికారిగా ఉండే భూమిక కు వరంగల్ లో అడ్డగోలుగా ..లైసెన్స్ లు లేకుండా..కండిషన్ లేకుండా బస్సులు నడిపే వ్యక్తితో వివాదం మొదలవువుతుంది. అంతే భూమికను హత్య చేయించేందుకు విలన్ ప్లాన్ చేస్తాడు. మరి నాని దీన్ని ఎలా అడ్డుకున్నాడు. అంతగా సఖ్యతగా లేని వదిన, నానిల మధ్య ఎలా సయోధ్య కుదిరిందనేది వెండి తెరపై చూడాల్సిందే. ఫిదా సినిమాలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న సాయి పల్లవికి ఈ సినిమాలో పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు. సినిమా అంతా నాని..భూమికల చుట్టూనే తిరుగుతుంది.

అయినా కూడా నానికి సాయిపల్లవి లవ్ ప్రపొజ్ చేసే సీన్లు...అప్పటి వరకూ ప్రేమికురాలిగా ఉన్న అమ్మాయి సడన్ గా మరదలుగా ఇంట్లోకి వచ్చే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే డ్యాన్సుల్లో సాయి పల్లవి ముందు నాని తేలిపోయాడనే చెప్పాలి. పాటలు ఆకట్టుకున్నాయి. మధ్య తరగతి ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్..పరిస్థితులను దర్శకుడు వేణు శ్రీరామ్ విజయవంతంగా చూపించాడనే చెప్పొచ్చు. మధ్యలో మధ్యలో ఉన్న కామెడీ ట్రాక్..వెన్నెల కిషోర్..నానిల మధ్య సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉద్విగ్నతకు గురిచేస్తాయి. ఎంసీఏ సినిమాతో నాని తన విజయపరంపరను కొనసాగించినట్లు అయిందనే చెప్పొచ్చు.

రేటింగ్. 3/5

Next Story
Share it