Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

దుమ్మురేపిన ఎంసీఏ కలెక్షన్లు

0

నాని కొత్త సినిమా ఎంసీఏ ఫస్ట్ రోజే కలెక్షన్లపరంగా దుమ్మురేపింది. గత సినిమాలకు భిన్నంగా నాని తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించినట్లు సమాచారం. ఎంసీఏ సినిమా గురువారం నాడే విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నానికి జోడీగా సాయిపల్లవి నటించింది. ఎంసీఏకి వచ్చిన కలెక్షన్లు చూస్తే ఆయన కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా ఇది నిలుస్తోంది.

- Advertisement -

అయితే గత చిత్రాలతో పోలిస్తే ఎంసీఏలో నాని దూకుడు కాస్త తగ్గినట్లు కన్పించినా..సినిమా మాత్రం ఓకే అన్పించింది. ఫస్ట్ రోజు కలెక్షన్లు చూసి చిత్ర  యూనిట్ కుషీ కుషీగా ఉంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. నాని తదుపరి చిత్రం కృష్ణార్జున యుద్ధం షూటింగ్ సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.