దుమ్మురేపిన ఎంసీఏ కలెక్షన్లు
BY Telugu Gateway22 Dec 2017 2:07 PM IST
Telugu Gateway22 Dec 2017 2:07 PM IST
నాని కొత్త సినిమా ఎంసీఏ ఫస్ట్ రోజే కలెక్షన్లపరంగా దుమ్మురేపింది. గత సినిమాలకు భిన్నంగా నాని తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించినట్లు సమాచారం. ఎంసీఏ సినిమా గురువారం నాడే విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నానికి జోడీగా సాయిపల్లవి నటించింది. ఎంసీఏకి వచ్చిన కలెక్షన్లు చూస్తే ఆయన కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా ఇది నిలుస్తోంది.
అయితే గత చిత్రాలతో పోలిస్తే ఎంసీఏలో నాని దూకుడు కాస్త తగ్గినట్లు కన్పించినా..సినిమా మాత్రం ఓకే అన్పించింది. ఫస్ట్ రోజు కలెక్షన్లు చూసి చిత్ర యూనిట్ కుషీ కుషీగా ఉంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. నాని తదుపరి చిత్రం కృష్ణార్జున యుద్ధం షూటింగ్ సాగుతోంది.
Next Story