Telugu Gateway
Cinema

నాని ‘ఎంసీఏ’ సెన్సార్ పూర్తి

వరస హిట్లతో దూసుకెళుతున్న నాని మరో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడా?.అంటే అవునంటున్నాయి ఎంసీఏ చిత్ర వర్గాలు. ఎందుకంటే నాని హీరోగా నటించిన ఎంసీఏ..మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంతే కాదు ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నానికి జోడీగా ఫిదా ఫేం సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.

వీళ్లిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు మరింత పెరిగిన సంగతి తెలిసిందే. ఎంసీఏ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోతో పాటు టీజర్, ట్రైలర్ లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించింది.

Next Story
Share it