నాని కొత్త సినిమా వచ్చేస్తోంది
BY Telugu Gateway28 Dec 2017 6:22 AM GMT
Telugu Gateway28 Dec 2017 6:22 AM GMT
వరస హిట్లతో దూసుకెళుతున్న హీరో నాని కొత్త సినిమా అప్పుడే విడుదలకు రెడీ అవుతోంది. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమా విడుదలై ఇంకా పది రోజులు కూడా కాకుండానే..కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించేశారు. అదే కృష్ణార్జున యుద్దం. ఈ సినిమా 2018, ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు చెబుతున్నారు.
అంటే కొత్త సంవత్సరంలోనూ నాని తన సినిమాల హవాను కొనసాగించటానికి రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ఎంసీఏ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులే సాధించింది. మరి నాని కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే 2018 ఏప్రిల్ వరకూ వేచిచూడాల్సిందే.
Next Story