‘మళ్ళీ రావా’ మూవీ రివ్యూ
చాలా గ్యాప్ తర్వాత సుమంత్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన నటించిన ‘మళ్ళీ రావా’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సుమంత్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇదే తొలి సినిమా. సరైన హిట్లు లేక కొత్త సినిమాకు గ్యాప్ తీసుకున్న సుమంత్ కు ‘మళ్ళీ రావా’ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే ముందుకు సాగాల్సిందే. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఇది ప్యూర్ లవ్ స్టోరీ. చిన్నప్పుడే హీరో..హీరోయిన్లు ప్రేమలో పడ్డ సినిమాలో తెలుగులో గతంలోనూ చాలా వచ్చాయి. కానీ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం కొత్త పద్దతిలో ఉంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగుల్చుతుంది. తొమ్మిదో తరగతి చదివే సమయంలోనే కార్తీక్(సుమంత్), అంజలి(ఆకాంక్ష సింగ్) ప్రేమలో పడతారు. ఈ ప్రేమ వ్యవహారం పెద్దవాళ్ల వరకూ వెళ్లి ఇంట్లో ఇద్దరికీ దెబ్బలు పడే పరిస్థితి వస్తుంది. ఈ వ్యవహారం తెలిసి అంజలి తల్లి,దండ్రులు స్కూల్ నుంచి టీసీ తీసుకుని వెళ్లిపోతారు. అయినా కార్తీక్ అంజలిని ఎప్పుడూ మర్చిపోకుండా నిత్యంలో పాత జ్ణాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాడు. తర్వాత అంజలి అమెరికా వెళ్లిపోతుంది. ఓ సారి హైదరాబాద్ ప్రాజెక్ట్ పని మీద వస్తుంది. అదే ఆఫీస్‌లో కార్తీక్ తారసపడతాడు. వాళ్లిద్దరూ ప్రేమను వ్యక్తపరుచుకుని రిజిస్టార్ ఆఫీసులో పెళ్ళికి సిద్ధపడతారు. కానీ చివరి నిమిషంలో అంజలి తనకు పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. అలా ఎందుకు చెబుతుంది...తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలుసుకుంటారా? లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే.
ఇక నటీనటుల విషయానికి వస్తే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సుమంత్ మరింత మెచ్యూర్డ్ గా కన్పించాడు. తొలి సినిమా అయినా ఆకాంక్ష సింగ్ నటన..హావభావాలు బాగా పలికించిందనే చెప్పాలి. ఈ సినిమాలో నటులతో భావోద్వేగాలను పలికించటంలో దర్శకుడు గౌతం సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఈ సినిమాలో మిర్చి కిరణ్ కామెడి ట్రాక్ ప్రేక్షకులను ఎంగాగానో నవ్విస్తుంది. ఐటి కంపెనీలో కార్తీక్ అండ్ టీమ్ చేసే సందడి...సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఫస్టాఫ్ లో చాలా వరకూ కామెడీతో సినిమా హాయిగా ముందుకు సాగిపోతుంది. సెకండాఫ్ లో ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ఈ సినిమాలో కార్తీక్..అంజలి మద్య సాగిన డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా చూస్తే ‘మళ్ళీ రావా’తో సుమంత్ మంచి హిట్ దక్కించుకున్నట్లే. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుందనటంలో ఏ మాత్రం సందేహం. ఇది ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ.
రేటింగ్. 3.25/5