చంద్రబాబుపై కెటీఆర్ పొగడ్తలు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ ఐటి మంత్రి కెటీఆర్ తొలిసారి ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ కు అగ్రశ్రేణి ఐటి కంపెనీలు తీసుకు రావటంలో ఆయన పాత్రే ఉందని ప్రకటించారు. సైబరాబాద్ డెవలప్ మెంట్ కూడా ఆయన హయాంలోనే జరిగిందని తెలిపారు. హైదరాబాద్ ను ఐటి హబ్ గా ప్రపంచంలో ఓ గుర్తింపు తీసుకురావటంలో చంద్రబాబు పాత్ర కాదనలేనిదని, . మైక్రో సాఫ్ట్ తో పాటు ఎన్నో కీలక సంస్థలను హైదరాబాద్ కు రప్పిచటంలో తమ పాత్ర ఏమీలేదని..అవన్నీ చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ కు వచ్చాయని తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్ లో జరిగిన టెక్ మహీంద్రా సంస్థ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలోనే టెక్ మహీంద్రా సీఈవో సీ పీ గుర్నానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెటీఆర్ ఈ సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో భవిష్యత్ లో హైదరాబాద్ కు సంబంధించి అమలు చేయనున్న ప్రణాళికల గురించి కూడా కెటీఆర్ వివరించారు. హైదరాబాద్ ఒక్క రోజులో ప్రగతి సాధించలేదని..దీనికి 450 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు.
అదే సమయంలో అమరావతి రాబోయే సంవత్సరాల్లో మంచి ప్రగతి సాధిస్తుందని వ్యాఖ్యానించటం విశేషం. కెటీఆర్ నోటి నుంచి చంద్రబాబుపై..అమరావతిలో ఇంత సానుకూల ప్రకటనలు రావటం ఇదే మొదటిసారి. గత కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా టీఆర్ ఎస్ పై...కెసీఆర్ ఎక్కడా ఒక్క విమర్శ కూడా చేయటం లేదు. పైగా ఈ మధ్య టీ టీడీపీ సమావేశంలో పాల్గొని పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా టీడీపీ నేతలు పెద్దగా టీఆర్ఎస్ పై విమర్శలు చేయకుండా ఉంటుందన్నారు. ఈ తరుణంలో కెటీఆర్ చంద్రబాబుపై ఈ స్థాయిలో పొగడ్తలు కురిపించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.