Telugu Gateway
Telangana

ఎన్టీవీ యాంకర్ తీరుపై కోదండరాం ఫైర్

తెలంగాణ జెఏసీ ఛైర్మన్ కోదండరాం ఎన్టీవీపై ఫైర్ అయ్యారు. ‘ చర్చను ఇలా చేయవద్దు. చాలా అన్యాయం గా మాట్లాడుతున్నారు. ఇంత సేపు చర్చ చేశాం. ఎక్కడా నిరుద్యోగ సమస్య, సమాజంపై దాని ప్రభావం. ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి అనే అంశంపై చర్చ చేయలే. జర్నలిజం కూడా ఈ స్థాయిలో ఉండటం మంచిది కాదు. జర్నలిజం అనేది చర్చను పట్టాలపైకి ఎక్కించాలి. కానీ చర్చ పక్కదారి పట్టేలా చేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీవీలో జరిగే పాయింట్ బ్లాంక్ కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోదండరాం ఉద్యమాలకు మావోయిస్టు ఏజెండా అప్లయ్ చేస్తున్నారు. ఉద్యమాలకు, ప్రభుత్వంపై పోరాటాలకు అని యాంకర్ వేసిన ప్రశ్నపై కూడా కోదండరాం సీరియస్ అయ్యారు. ఈ మాట ఎవరు అన్నరో పేరు చెపితే నేను మాట్లాడుతా. గాలివాటంగా ఎవరెవరో మాట్లాడితే రోడ్డు మీద పోయే వారు ఎవరో అన్నదానికి నువ్వు సమాధానం చెప్పు అంటే ఎలా?. అని ప్రశ్నించారు.

సీఎం కెసీఆర్ తనలాంటి వాళ్ళనే కాదు కనీసం తన మంత్రులను కూడా కలవటంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో తాను సహకరించినప్పుడు గుర్తుకురాని కులం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుందని కోదండరాం ప్రశ్నించారు. కెసీఆర్ తన అధికారాన్ని కాంట్రాక్టులు అప్పగించటానికి కమిషన్లు దండుకోవటానికి, ఆ డబ్బు ద్వారా ప్రత్యర్థి పార్టీల్లోని రాజకీయ నాయకులను కొనటానికి వాడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టుల్లో కూడా తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనన్నారు. అంత మాత్రాన ఎవరూ ఇక్కడికి రాకూడదని చెప్పటంలేదని..తెలంగాణ వాళ్లకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. రాజకీయాలు అంటే నిరుద్యోగ సమస్య వంటి వాటి పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేయాలి కానీ..ప్రస్తుత ప్రభుత్వంలా కాదన్నారు. మిషన్ భగీరథ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోంది. పైపుల పేరిట రిబేట్ ఎంత వచ్చింది..అది ఎవరికి దక్కింది. నిజంగా నువు ఎక్కడ నుంచి పైపులు వేయాలి. డిజైన్లు సమగ్రంగా ఎవరు అప్రూవ్ చేశారు. ఇవి అన్నీ అడగాల్సిన ప్రశ్నలు. చాలా మంది నిఫుణులు అనేది ఏంటంటే 15-16 వేల కోట్లకు అయ్యేదాన్ని 40-50 వేల కోట్లకు పెంచారు అని చెబుతున్నారు.

ఇది కాంట్రాక్టర్లకు లాభం..మధ్యలో కమిషన్లు దొరికే రాజకీయ నాయకులకు లాభం కాని మధ్యలో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇరిగేషన్ లో కూడా రీడిజైన్ పేరుతో ఖర్చును తగ్గించి..నీళ్లు అందించే ప్రాంతం పెంచాలి కానీ..ఖర్చును పెంచి ఇతర కార్యక్రమాలకు బడ్జెట్ లేకుండా చేశారు. బడ్జెట్ ఏ స్థితికి చేరుకుంది అంటే ఫీజు రీఎంబర్స్ కు లేవు..ఆరోగ్యశ్రీకి లేవు, వైద్య శాలకు లేవు..ఆఖరికి ఖాళీల భర్తీకి కూడా నిధులు లేవు. అందుకే ఉధ్యోగాలు భర్తీచేయలేని సందర్బంలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వంలో పద్దతులు..ప్రాధాన్యతలు మారాలని కోదండరాం సూచించారు. ఇవన్నీ అడుగుతుంటే ఆ అంశాలను పక్కన పెట్టి నీ కులం ఏంటి..నీవు ఎవరిని కలిశావు..ఎందుకు కలిశావు వంటి ప్రశ్నలు ఏంటి? అని కోదండరాం వ్యాఖ్యానించారు.

Next Story
Share it