Telugu Gateway
Telugu

మోడల్ కు షాకిచ్చిన ప్రియుడు

వాళ్లిద్దరూ రెండేళ్ల నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలోనే ప్రపోజ్ చేస్తాడని ఆమె గట్టిగా నమ్మింది. తన ప్రేమికుడు పారిస్ తీసుకెళతానంటే ఎగిరి గంతేసింది. ఇద్దరూ హాయిగా అలా పారిస్ లో తిరిగారు. అందమైన...ఎంతో సుందరమైన పారిస్ వెళుతున్నాం కదా..ప్రేమ విషయం అక్కడే చెబుతాడని ఆ అందమైన మోడల్ ఆశించింది. కానీ ఆమెకు ఊహించని సంఘటన ఎదురైంది. ఇలా ప్రియుడి చేతిలో భంగపడిన వ్యక్తి ఎవరో కాదు..మోడల్, హాలీవుడ్ నటి కెల్లీ బ్రూక్. తాను ఊహించింది జరగకపోవడంతో పాటు షాక్ తిన్నానని చెప్పింది కెల్లీ.

మోడల్ కెల్లీ బ్రూక్, జెరేమీ పార్శి గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పారిస్‌కు హాలిడే ట్రిప్ అంటూ పారిస్ లో అలా అలా తిరిగేశారు కూడా. పారిస్ పర్యటనలో తమ కోసం బుక్ చేసిన హోటల్‌ గతంలో వ్యభిచార గృహమని తెలియగానే ఇలాంటి చోట ఉన్నామా అని షాక్‌కు గురయ్యానని ఆమె వాపోయింది. ప్రపోజ్ చేయకపోతేనేం, జంటగా షాపింగ్ చేశాం. జెరేమీ పేరెంట్స్‌ ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ' తనకు పారిస్‌లో ఎదురైన అనుభవాలను కెల్లీ బ్రూక్ తెలపటం పెద్ద చర్చకు దారితీసింది.

Next Story
Share it