రామ్ చరణ్ ఇంటికెళ్ళిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అంతే కాదు..ఇద్దరు అగ్రహీరోల్లో ఒకరిది నెగిటివ్ రోల్ అనే సంచలన విషయం ప్రచారంలో ఉంది. అయితే ఈ నెగిటివ్ రోల్ ఎన్టీఆర్ చేస్తారా?.లేక రామ్ చరణ్ చేస్తారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అంతే కాదు..ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై అధికారికంగా ఎవరూ ఏమీ ప్రకటించకపోయినా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్య రాజమౌళితో కలసి జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లు దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే తొలుత ఇది ఓ సరదా ఫోటో అనుకున్నారు..కానీ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరుణంలో ఎన్టీఆర్ గురువారం నాడు రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అయితే దీనికి సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రీ కిస్మస్ వేడుకల్లో భాగంగా రామ్ చరణ్ భార్య ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్ చెట్టు తయారు చేశారు. ఈ పంక్షన్ కు ఎన్టీఆర్ ఒక్కరే కాదు...మరో హీరో శర్వానంద్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.