Telugu Gateway
Telugu

కామ‌సూత్ర హోట‌ల్‌

హోట‌ల్ కు ఎవ‌రైనా ఇలాంటి పేరు పెట్టుకుంటారా?. అంటారా. అలా అనుకున్నారంటే చాలు...నా హోట‌ల్ సక్సెస్ అయిన‌ట్లే అంటుంది బాలీవుడ్ భామ జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటే ఆమె హోట‌ల్ పేరు అదే కాబ‌ట్టి. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ న‌టులు అంద‌రూ హోట‌ల్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. వారి జాబితాలో ఇప్పుడు జాక్వ‌లిన్ కూడా చేరింది. ఆమె .శ్రీలంకలో చైన్ హోటల్ బిజినెస్ ను మొదలు పెట్టింది. అయితే హోటల్స్ కు జాక్వలిన్ ఎంచుకున్న పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ భామ తన హోటల్స్ ను కామసూత్ర పేరుతో ప్రారంభించనుందట.

జాక్వలిన్ ఈ పేరు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరగా భోజన ప్రియుల దృష్టిలో పడేందుకు అలాంటి పేరు పెట్టిందట. జుడ్వా 2 సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న జాక్వలిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రేస్ 3, సుశాంత్ తో డ్రైవ్ సినిమాల్లో నటిస్తోంది.ఆమె ఒక్క‌టే కాదు ప‌లువురు న‌టీమ‌ణులు హోట‌ల్ రంగంతో పాటు...ఆభ‌ర‌ణాల రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయిన తాప్సీ కూడా వెడ్డింగ్ ప్లాన‌ర్ బిజినెస్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it