Telugu Gateway
Cinema

పెళ్లి చేసుకున్న ‘ఇలియానా’

ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన గోవా భామ ఇలియానా పెళ్లి చేసుకుంది నిజమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ భామే ఓ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పెట్టి ఆ ఫోటోను తన హబ్బి తీశాడని చెప్పేసింది. ఇక మరి అనుమానం ఎందుకు మనకు. ఇలియానా తన ప్రేమికుడు..ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబొనేను పెళ్లి చేసుకున్నట్లు ఆమె చెప్పకనే చెప్పేసినట్లు అయింది. దీంతో గత కొంత కాలంగా షికారు చేస్తున్న పుకార్లకు బ్రేక్ పడినట్లే. గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబొనెతో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నట్టు గతంలోనూ ప్రచారం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలో ఇలియానా ఈ విషయాన్ని ధృవీకరించింది.

క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్‌ చేసింది. తాను షేర్‌ చేసిన ఫొటో తన భర్త(హబ్బీ) ఆండ్రూ తీశాడని పేర్కొంది. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా ఘటనతో పెళ్ళి అయినట్లు నిర్థారణ అయిపోయింది. తొలిసారి ఈ ప్రేమ జంట 2014లో ముంబై రెస్టారెంట్‌లో కెమెరా కంటికి చిక్కారు. కొద్ది కాలం క్రితం సరైన అవకాశాలు వస్తే టాలీవుడ్ లో సినిమాలు చేయటానికి రెడీ అని ప్రకటించారు.అయినా సరే ఇలియానా ను సంప్రదించిన వారు ఎవరూ లేరు.

Next Story
Share it