Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘అజ్ఞాతవాసి’ లో వెంకటేష్

0

అజ్ఞాతవాసి సినిమాపై రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఓ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అదీ గెస్ట్ రోల్ లో. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఎక్కడా ఒకే సీన్ లో కన్పించరని..కాకపోతే వెంకటేష్ ఓ అతిధి పాత్రలో నటించారని టాలీవుడ్ టాక్. వెంకటేష్ తో పాటు గతంలో హీరోయిన్ గా చేసిన ఇంద్రజ కూడా ఈ సినిమాలో ఉంది. గతంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్  కలసి గోపాల గోపాల సినిమాలో చేసిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. మరో ఒకట్రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటను విడుదల చేయనున్నారు.

- Advertisement -

అంతే కాకుండా..కొత్త సంవత్సరం రోజు కానీ..ఆ తర్వాత కానీ అజ్ఞాతవాసి  ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు అజ్ఞాతవాసి  సినిమా ఓ కొత్త రికార్డు నమోదు చేసుకోనుంది. అదీ అమెరికాలో. లాస్ ఏంజెల్స్ లోని యూనివర్శల్ స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న సిటీ వాక్ ధియేటర్ లో ప్రదర్శించబోయే తొలి భారతీయ  చిత్రం  ఇదే కానుండటం విశేషం. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న  విషయం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.