Telugu Gateway
Cinema

‘అజ్ఞాతవాసి’ లో వెంకటేష్

అజ్ఞాతవాసి సినిమాపై రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఓ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అదీ గెస్ట్ రోల్ లో. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఎక్కడా ఒకే సీన్ లో కన్పించరని..కాకపోతే వెంకటేష్ ఓ అతిధి పాత్రలో నటించారని టాలీవుడ్ టాక్. వెంకటేష్ తో పాటు గతంలో హీరోయిన్ గా చేసిన ఇంద్రజ కూడా ఈ సినిమాలో ఉంది. గతంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలసి గోపాల గోపాల సినిమాలో చేసిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. మరో ఒకట్రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటను విడుదల చేయనున్నారు.

అంతే కాకుండా..కొత్త సంవత్సరం రోజు కానీ..ఆ తర్వాత కానీ అజ్ఞాతవాసి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు అజ్ఞాతవాసి సినిమా ఓ కొత్త రికార్డు నమోదు చేసుకోనుంది. అదీ అమెరికాలో. లాస్ ఏంజెల్స్ లోని యూనివర్శల్ స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న సిటీ వాక్ ధియేటర్ లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రం ఇదే కానుండటం విశేషం. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it