బాలకృష్ణ దూకుడు
BY Telugu Gateway11 Dec 2017 8:58 AM IST
Telugu Gateway11 Dec 2017 8:58 AM IST
నందమూరి బాలకృష్ణ దూకుడు ఏ మాత్రం తగ్గటం లేదు. సంక్రాంతి ఆయనకు కలిసొచ్చిన సీజన్ లా ఉంది. అందుకే ఈ సంక్రాంతి బరిలోనూ నిలవటానికి రెడీ అయ్యాడు. జై సింహ సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి...సంక్రాంతి పందెం నుంచి తప్పుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తోంది.
బాలకృష్ణ,నయనతారపై దుబాయ్ లో పాటను చిత్రీకరించారు.దీంతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు కె ఎన్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరులో పాటలు విడుదల చేస్తున్నారు. జై సింహ సినిమాలో నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రలు పోఫిస్తున్నారు.
Next Story